టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ కు చేరువలో సౌతాఫ్రికా.. 12 d ago
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఈ సారి భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు చేరుకోవడం ఖాయం అని భావిస్తుంటే అనుకోకుండా సౌతాఫ్రికా రేస్ లోకి దూసుకొచ్చింది. అంతే కాదు ఫైనల్ బెర్త్ కు కేవలం ఒక్క విజయం దూరంలో నిలిచింది. ప్రస్తుత డబ్ల్యూటీసీలో సౌతాఫ్రికా టాప్ లో ఉంది. తొలి ఐదు టెస్టుల్లో ఒక్కదాంట్లోనే నెగ్గిన ఆ టీమ్ గత ఐదు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి 63.33 పీటీసీతో పట్టికలో అగ్రస్థానం అందుకుంది.
డిసెంబర్ నెల 26 నుండి స్వదేశంలో పాకిస్తాన్ తో రెండు టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా ఒక్క దాంట్లో గెలిస్తే నేరుగా ఫైనల్ కు రెడీ అవుతుంది. స్వదేశంలో పాకిస్థాన్ జట్టును ఒక్క మ్యాచ్ లో ఓడించడం సౌతాఫ్రికాపై పెద్ద కష్టమేమీ కాదు. దీంతో 2025 లార్డ్స్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు సఫారీలు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్ పై భారత్ క్లీన్ స్వీప్ కావడం, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉండడం సౌతాఫ్రికాపై అనుకూలంగా మారింది.
ఈ పాయింట్ల పట్టికలో మొన్నటివరకు అగ్రస్థానంలో వున్న టీం ఇండియా న్యూజిలాండ్ తో 3, ఆస్ట్రేలియాతో 1 ఓడిపోయి మూడో స్థానానికి పడిపోయింది. మన జట్టుకు మరో మూడు టెస్టులే మిగిలున్నాయి. ఫైనల్ చేరాలంటే బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలోని ఈ మూడు మ్యాచ్లో రెండింటిలో గెలిచి.. ఒకదాన్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇండియా 2-1తో ఈ సిరీస్ నెగ్గినా ఆసీస్‌కే చాన్స్ ఉంటుంది. ఆసీస్ లంకను 2-0తో ఓడిస్తే , సౌత్రాఫికా పాకిస్తాన్తో ఆడే రెండు టెస్టుల్లో ఒక మ్యాచ్ నెగ్గితే ఫైనల్ కి చేరుతుంది.